Share News

Yoga Guru In Honey Trap: హనీ ట్రాప్‌‌లో చిక్కుకున్న యోగా గురువు.. పోలీసుల ఎదుట లబోదిబో..

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:58 PM

హైదరాాబాద్ నగరానికి చెందిన ప్రముఖ యోగా గురువు.. హానీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. దీంతో అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో రూ. 50 లక్షలు చెల్లించారు. కానీ మరో రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

Yoga Guru In Honey Trap: హనీ ట్రాప్‌‌లో చిక్కుకున్న యోగా గురువు.. పోలీసుల ఎదుట లబోదిబో..
Yoga Guru In Honey Trap:

హైదరాబాద్, సెప్టెంబర్ 14: యోగా గురువును ఒక గ్యాంగ్ పథకం ప్రకారం హనీ ట్రాప్ చేసింది. అనంతరం యోగా గురువును సదరు గ్యాంగ్ భారీగా నగదు డిమాండ్ చేసింది. దీంతో అతడు కొంత సొమ్మును ఆ గ్యాంగ్‌కు ముట్ట చెప్పాడు. అయినా సంతృప్తి చెందని ఆ గ్యాంగ్.. యోగా గురువును రూ.2కోట్లు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ యోగా గురువు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


అందులో భాగంగా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో ఆ బాధితుడు యోగా గురువుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ ఇద్దరు మహిళలు యోగా గురువును ఆశ్రయించారు. అలా ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. అనంతరం యోగా గురువుతో సదరు మహిళలు అత్యంత సన్నిహితంగా మెలిగారు.


ఆ తర్వాత అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సదరు యోగా గురువును లక్ష్యంగా చేసుకుని ఒక గ్యాంగ్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఆ క్రమంలో ఆ గ్యాంగ్‌కు తొలుత రూ.50 లక్షల చెక్కును అందజేశారు యోగా గురువు. అయితే తమకు మరో రూ.2కోట్లు ఇవ్వాలంటూ బాధితుడిని ఆ గ్యాంగ్ డిమాండ్ చేసింది.


ఈ నేపథ్యంలో యోగా గురువుకు వారి బెదిరింపులు అధికమయ్యాయి. చేసేదేమీ లేక.. గోల్కొండ పోలీసులను ఆయన ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆయన ఫోన్ కు వచ్చిన కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆ క్రమంలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నేటికి దేశవ్యాప్తంగా బాలికలపై లైంగిక వేధింపులు..

మేధా హైస్కూల్‌పై విద్యాశాఖ కీలక నిర్ణయం..

For More TG News And Telugu news

Updated Date - Sep 14 , 2025 | 06:12 PM