రాష్ట్రంలోని భరోసా కేంద్రాల పని తీరు దేశంలోనే ఆదర్శంగా ఉందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు సైతం భరోసా కేంద్రాల నిర్వహణను అధ్యయనం చేసి వెళుతున్నారని తెలిపారు. సోమవారం భువనగిరిలో జిల్లా పోలీస్ కార్యాలయం, భరోసా కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు.
అద్భుత ఆధ్యాతిక క్షేత్రంగా రూపుదిద్దుకు న్న పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దేశవ్యాప్తంగా యాత్రీకులు సందర్శిస్తుం టారు. హైదరాబాద్ మహానగరం నుంచే కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం దివ్యక్షేత్రం సందర్శనకు రైల్వే సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు.
డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 6న భువనగిరికి రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని, భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు.
పదహారేళ్ల తర్వాత మళ్లీ చేపట్టనున్న జనగణనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు జనగణన కీలకం కావడంతో కేంద్రం కూడా ఇప్పటికే నియమ నిబంధనలు రూపొందించింది.
ఆర్జిజన్ల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యుత ఆర్టిజన ఉద్యోగుల జాయింట్ యాక్షన కమిటీ పిలుపుమేరకు గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సర్కిల్ ఆఫీస్ ముందు టీవీఏజేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన, కన్వీనర్ల అధ్యక్షతన వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాలికి గజ్జె కట్టి పల్లెపల్లెన తిరుగుతూ ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేసిన ప్రజానాట్యమండలి కళాకారుడు, రచయిత, గాయకుడు జహంగీర్ గుండెపోటుతో యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో గురువారం మృతి చెందారు.
సౌరశక్తి వినియోగించే దేశంగా మార్చే ప్రయత్నంలో భాగంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
సూర్యాపేట జిల్లాలో మత్స్యకార్మిక సంఘాల పాలకవర్గాలపై వ్యాపారుల పెత్తనంతో కార్మికుల కడుపు నిండని పరిస్థితులు దాపురించాయి. చెరువులు, కుంటల్లో చేప పెంపకాన్ని మత్స్యకారులే చేపట్టి, విక్రయించుకుని ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం నిబంధన పెట్టినా ఉపయోగం ఉండడంలేదు.
నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శాసనసభా నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేరేడుచర్ల నియోజకవర్గ ఏర్పాటుపై స్థానికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్లు అంతకంటే ఎక్కువ వయ స్సున్న విద్యార్థులను మాత్రమే పాఠశాలలో చేర్చుకుంటారు.