Share News

చేనేత పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:22 AM

ఎంఎ్‌సఎంఈ పథకాలపై చేనేత కళాకారులు అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భూదానపోచంపల్లి హస్తకళ వీవర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ చిక్క కృష్ణ కోరారు.

చేనేత పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎంఎ్‌సఎంఈ పథకాలపై చేనేత కళాకారులకు అవగాహన కల్పిస్తున్న ప్రతినిధి సీత లక్ష్మణ్‌

భూదానపోచంపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఎంఎ్‌సఎంఈ పథకాలపై చేనేత కళాకారులు అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భూదానపోచంపల్లి హస్తకళ వీవర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ చిక్క కృష్ణ కోరారు. ఎంఎ్‌సఎంఈ కాంపిటీటివ్‌ (లీన) స్కీం పథకంపై గురువారం భూదానపోచంపల్లిలో హస్తకళ వీవర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సీత లక్ష్మణ్‌ చేనేత కళాకారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లీన స్కీమ్‌ ఉద్దేశంతోపాటు చేనేత ఉత్పత్తులను పెంచుకోవడం, వేస్టేజీని తిరిగి ఉపయోగించడం, ఎంఎ్‌సఎంఈ పథకాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీహస్తకళ వీవర్స్‌ ప్రొడ్యూస్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్స్‌ చిక్క కృష్ణతోపాటు డబ్బికార్‌ సాయే్‌షకుమార్‌, సీత వెంకటేశం, గంజి బస్వలింగం, ఏలె శ్రీనివాస్‌, నక్క సంగీత, ఎంఎ్‌సఎంఈ జెడ్‌ ఫెసిలిటేటర్స్‌ ప్రతినిధులు ఆటిపాముల మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 12:22 AM