Share News

బాలాజీనాయక్‌ ఏజెంట్లలో మొదలైన అలజడి

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:45 AM

అధికవడ్డీకి ఆశపడి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలానికి చెందిన రమావత బాలాజీనాయక్‌, మధునాయక్‌ ఉదంతంలో ఏజెంట్లలో అలజడి మొదలైంది. వడ్డీ విషయం బయటకు చెప్పవద్దని, చెబితే డబ్బులు రావని ద్వితీయశ్రేణి ఏజెంట్లు బాధితులను బెదిరించేవారు. దీంతో బాధితులు వెనుకడుగు వేశారు.

బాలాజీనాయక్‌ ఏజెంట్లలో  మొదలైన అలజడి

ప్రత్యక్షచర్యలకు దిగుతున్న బాధితులు

బాలాజీనాయక్‌ కంటే మధునాయక్‌పైనే ఫిర్యాదులు ఎక్కువ

పెద్దఅడిశర్లపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అధికవడ్డీకి ఆశపడి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలానికి చెందిన రమావత బాలాజీనాయక్‌, మధునాయక్‌ ఉదంతంలో ఏజెంట్లలో అలజడి మొదలైంది. వడ్డీ విషయం బయటకు చెప్పవద్దని, చెబితే డబ్బులు రావని ద్వితీయశ్రేణి ఏజెంట్లు బాధితులను బెదిరించేవారు. దీంతో బాధితులు వెనుకడుగు వేశారు.ఇటీవల బాలాజీనాయక్‌తో పాటు మధునాయక్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించడంతో బాధితులు ఒక్కొక్కరూ గుడిపల్లి పోలీ్‌సస్టేషనను ఆశ్రయించగా మరికొందరు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. ఏజెంట్ల ఇళ్ల వద్దకు, ఆస్తులు ఎక్కడ ఉన్నాయో ఆరా తీసి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏజెంట్లలో అలజడి మొదలైంది. ఇన్నిరోజులు బాలాజీనాయక్‌, మధునాయక్‌ను నమ్ముకుని ఉన్న ఏజెంట్లు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. అంతేకాకుండా బాలాజీనాయక్‌, మధునాయక్‌ దగ్గర తర్ఫీదు పొందిన ఏజెంట్లు వారి కంటే అధికవడ్డీలు ఇస్తామని జనాలను మోసం చేసినట్లు తెలుస్తోంది. అమాయక ప్రజల వద్ద డబ్బులు తీసుకున్న ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుస్తుందని బాధితులు వేడుకుంటున్నారు. బాధితులకు ప్రామిసరీ నోట్లపై అవగాహన లేకపోవడంతో ఏజెంట్లకు వరంలా మారింది. బాధితులకు ఎన్ని రూ.కోట్లు అయినా ఒక్క ప్రామిసరీ నోట్‌పైనే రాసి ఇచ్చారు.

వీటి ఆధారంగా న్యాయం చేయడం పోలీసులకు సవాల్‌ మారింది. ఇదిలా ఉండగా రోజురోజుకు గుడిపల్లి పోలీ్‌సస్టేషనకు నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి ఏజెంట్లపై ఫిర్యాదులు అందుతున్నా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:45 AM