ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:23 AM
మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో అసంపూర్తిగా ఆగిపోయిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులు పూర్తిచేసి, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేశారు.
త్కూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో అసంపూర్తిగా ఆగిపోయిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులు పూర్తిచేసి, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేశారు. గురువారం డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ఉపకేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. గత ప్రభుత్వం రూ.20 లక్షల నిధులతో ఉపకేంద్రం నిర్మాణం పనులను ప్రారంభించినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పూర్తి చేయకుండానే వదిలేసి వెళ్లాడని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఉపకేంద్రం పనులకు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రారంభించినప్పటికీ పూర్తి కాలేదన్నారు. తక్షణమే ఉపకేంద్రం నిర్మాణం పూర్తి చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు బండి రాజు, కురుమేటి రాజ్‌కుమార్, నరేష్, పరమేష్, దామెర స్వామి, యాదయ్య పాల్గొన్నారు.