అక్షరాస్యతలో ముందు వరుసలో నిలిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి సూచనల కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
రాజాపేట మండలం పొట్టిమర్రి వాగుతో మండల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.
హైవేలపై ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా అర్ధరాత్రి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
విద్యుత్ మీటర్ రీడింగ్‌లో లోపం ఓ వినియోగదారుడికి శాపంగా మారింది. వేలల్లో బిల్లులు రాగా చెల్లించకపోవడంతో విద్యుత సరఫరాను నిలిపివేశారు. తప్పని తెలిసినా విద్యుత సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పడంలేదు.
గాయపడిన ఉద్యోగుల ప్రాణాలు కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్రభుత్వవిప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
వాగులను కొల్లగొట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో అడ్డూ అదుపులేకుండా ఇసుక మాఫీయా యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికల ఆరోగ్య పరిరక్షణకు పౌష్ఠికాహారం పంపిణీలో పారదర్శకతకు మహిళా శిశు సంక్షేమశాఖ కృషి చేస్తోంది. మూడేళ్లు నిండిన ప్రతీ చిన్నారితో పాటు మహిళల్లో పోషకాహారలోపం తలెత్తకుం డా పటిష్ఠ పంపిణీ వ్యవస్థను ఏర్పాటుచేసింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు విధించిన ఆదాయం లక్ష్య సాధన అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలోని ఐదు మార్కెట్ కమిటీలకు లక్ష్యాన్ని రెండు మాత్రమే సాధించాయి.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతమైన జిల్లాలో నీటి వనరుల సంరక్షణ కరువైంది. నీటిపారుదల శాఖ అధికారులు చెరువుల నిర్వహణను పట్టించుకోకపోవడంతో మట్టి అక్రమ తవ్వకాలతో వీటి రూపురేఖలు మారిపోయాయి.