వరదకు కొట్టుకుపోయిన చేపలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:12 AM
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఇటీవల భారీ వర్షాలకు చెరువులు అలుగు పోయడంతో చేపలన్నీ కొట్టుకుపోయాయి.
రూ.లక్షల్లో నష్టపోయాం:మత్స్యకారులు
నాంపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఇటీవల భారీ వర్షాలకు చెరువులు అలుగు పోయడంతో చేపలన్నీ కొట్టుకుపోయాయి. దీంతో రూ.లక్షల్లో మత్స్యకారులు నష్టపోయారు. మండలంలోని రేవెల్లి, కేతేపల్లి, పసునూరు చేపల చెరువుల్లో చేపలు పెంచారు. ఇటీవల అలుగులు పోయడంతో రూ.15లక్షల విలువైన చేపలు కొట్టుకుపోయినట్లు మత్స్యకారులు తెలిపారు. చేపలు పెరిగి చేతికొచ్చే సమయానికి నష్టం వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
రేవెల్లి చెరువులో చేపపిల్లలు వదిలాం. రూ.10లక్షల వరకు పెట్టుబడులు పెట్టాం. వర్షంతో చెరువు నిండి చేపలు వర్షపు నీటికి దిగువ భాగానికి కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన దశలో చేపలు కొట్టుకుపోయాయి. దీంతో నష్టపోయే పరిస్థితి. ప్రభుత్వం ఆదుకోవాలి.
మేకల రాములు, రేవెల్లి చేపల చెరువు మత్స్య సహకార సొసైటీ అధ్యక్షుడు