Share News

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:19 AM

వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
రామన్నపేట మార్కెట్‌ యార్డులో ధాన్యం రాశులను పరిశీలిస్తున్న రైతు సంఘం, సీపీఎం నాయకులు

రామన్నపేట, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక రామన్నపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఇటీవలి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సీపీఎం నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడమే ధాన్యం తడవడానికి కారణమని అన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రభుత్వమే చివరి గింజ వరకు కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, కందుల హనుమంతు, భావండ్లపల్లి బాలరాజు, సోములు, రామచంద్రం, శ్రవణ్‌, ముకుందం, గణేశ, వీరస్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 12:19 AM