రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జిలో నీటిని తొలగించాలి
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:21 AM
రామన్నపేట నుంచి కొమ్మాయిగూడెం, సిరిపురం వెళ్లే దారిలో ఉన్న రైల్వే అండర్‌పా్‌సలో నిలిచిపోయిన వాననీటిని వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య రైల్వే అధికారులను డిమాండ్ చేశారు.
రామన్నపేట, అక్టోబరు 31, (ఆంధ్రజ్యోతి): రామన్నపేట నుంచి కొమ్మాయిగూడెం, సిరిపురం వెళ్లే దారిలో ఉన్న రైల్వే అండర్‌పా్‌సలో నిలిచిపోయిన వాననీటిని వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన ఎదుట సీపీఎం, ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అండర్‌పాస్ వంతెనలో నిలిచిన నీటి కారణంగా విద్యార్థులు, రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించలేక ఇబ్బంది పడుతున్నా రైల్వే అధికారులు పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుచూపు లేకుండా నిర్మాణం గావించిన అండర్‌పా్‌సతో ఇబ్బంది పడుతున్నామని, ధాన్యం లారీలను కొనుగోలు కేంద్రాలకు వెళ్లలేక మధ్యలోనే ఆగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే నీటిని తొలగించేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంబంధిత పీడబ్ల్యూవో అధికారికి వినతి పత్రం అందచేశారు. ధర్నాలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, కూరెళ్ల నర్సింహ్మాచారి, కల్లూరి నగేశ, గొరిగే సోములు, శానగొండ రామచంద్రం, మెట్టు శ్రవణ్‌కుమార్, పుట్టల ఉదయ్‌కుమార్, మునికుంట్ల లెనిన, శానకొండ వెంకటేశ్వర్లు, అప్పం సురేందర్, నాగటి లక్ష్మణ్, ఆకటి శ్రీను, పున్న దత్తాద్రి, కుమారస్వామి ఉన్నారు.