నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:11 AM
చిన్న నిర్లక్ష్యానికి ఓ విద్యుత ఉద్యోగి నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు శివారులో జరిగింది.
ఎల్‌సీ తీసుకోకుండానే మరమ్మతులు
మోత్కూరు మండలంలో విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైనమన మృతి
మోత్కూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : చిన్న నిర్లక్ష్యానికి ఓ విద్యుత ఉద్యోగి నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు శివారులో జరిగింది. గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఓర్సు సురేష్(33) ఐదేళ్లుగా విద్యుతశాఖలో అసిస్టెంట్ లైనమనగా పనిచేస్తున్నాడు. ఈ నెల 29న భారీ వర్షానికి పాలడుగు శివారులోని బొడిగె కిష్టయ్య వ్యవసాయ బావి సమీపంలో విద్యుత ట్రాన్సఫార్మర్ దిమ్మె కుంగి, ట్రాన్సఫార్మర్ పక్కకు ఒరిగి విద్యుత సరఫరా నిలిచింది. ఏఈ ప్రభాకర్‌రెడ్డి, మరో హెల్పర్, ఏఎల్‌ఎం సురే్‌షతో కలిసి అక్కడకు వెళ్లారు. ఎల్‌సీ తీసుకోకుండా(విద్యుత సరఫరా నిలిపివేయకుండా) విద్యుత స్తంభంపై జంపర్లు కట్ చేసి ట్రాన్సఫార్మర్ మరమ్మతు పనులు ప్రారంభించారు. ట్రాన్సఫార్మర్ సరి చేసే క్రమంలో విద్యుత వైర్‌కు విద్యుత సరఫరా ఉన్న లైన తాకడంతో సురేష్ విద్యుదాఘాతానికి గురై స్పృహతప్పి పడిపోయాడు. వెం టనే సీపీఆర్ చేసి చికిత్సనిమిత్తం అతడిని ప్రైవేట్ వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సురే్‌షకు భార్య, ముగ్గురుపిల్లలు ఉన్నారు. సురేష్ కుటుంబానికి రూ.50లక్షలఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గసభ్యుడు ఇమ్రానతో కలిసి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో సురేష్ భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు.