శ్రీరామునికి రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి ప్రజలు ఎవరి స్థితికి తగ్గట్టు వారు విరాళాలు ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ నాయకులు రాముని పేరుతో, అక్షింతలపై విరాళాలు అడుక్కున్నారని విమర్శించారు.
సిద్దిపేట జిల్లాలోని కొండపాక సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ హాస్పిటల్‌ను సినీ నటుడు విజయ్ దేవరకొండ, మాజీమంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ అప్పులకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి పంపిన వాట్సాప్ లేఖ అందిందని తెలిపారు.
ఆహార ధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ మున్సిపాలిటీ నుంచి తరలిస్తున్న చెత్తను తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు గత 15 రోజులుగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.
ఎరువుల తయారీ, సరఫరా.. కేంద్రం పరిధిలోని అంశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎరువుల సరఫరా బీజేపీ బాధ్యత అని చెప్పుకొచ్చారు.
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది.
అసై.. దూల హారతి అంటూ గ్రామాల్లో పీర్ల పండుగ సందడి మొదలైంది.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయ పనులకు కూడా ఈ వర్షాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది.