Mother Attack on Daughter: అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని రెండేళ్ల కన్న కూతుర్ని చంపిన తల్లి, మెదక్ జిల్లా శభాష్‌పల్లిలో దారుణం
ABN , Publish Date - Sep 12 , 2025 | 08:39 PM
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని రెండు సంవత్సరాల కూతురిని ప్రియుడితో కలిసి చంపి పూడ్చిపెట్టింది ఒక తల్లి. అనంతరం వీరిద్దరూ గుంటూరుకి పారిపోయారు.
మెదక్, సెప్టెంబర్ 12: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డువస్తోందని రెండు సంవత్సరాల కూతురిని చంపి పూడ్చిపెట్టింది ఓ తల్లి. చిన్నారి తల్లి మమత, ప్రియుడు ఫయాజ్ ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. అనంతరం వీరిద్దరూ గుంటూరుకి పారిపోయారు.
ఇదిలా ఉంటే, మే 27వ తేదీ నుంచి తన కూతురు, భార్య కనిపించడం లేదంటూ మమత భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మమతను ఆమె ప్రియుడు ఫయాజ్ ను గుంటూరులో పట్టుకున్నారు. మమతను విచారించగా కూతురిని చంపినట్లు ఒప్పుకుంది.
ప్రియుడితో కలిసి రెండేళ్ల కన్న కూతుర్ని చంపి గ్రామ శివారులో వాగు దగ్గర పూడ్చి పెట్టామని మమత పోలీసులకు చెప్పింది. ఘటనా స్థలానికి ఇరువుర్ని తీసుకెళ్లిన పోలీసులు, ఈ రోజు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు.
ఇవి కూడా చదవండి..
మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
For More National News and Telugu News