Share News

Sushila Karki Nepal Interim PM: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

ABN , Publish Date - Sep 12 , 2025 | 07:56 PM

నేపాల్ ఆర్మీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌తో 'జెన్ జెడ్' ప్రతినిధులు సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్లమెంటును రద్దు చేసి, కర్మిని తాత్కాలిక ప్రధానిగా నియమించాలంటూ 'జెన్ జెడ్' ప్రతినిధులు డిమాండే చేయడంతో ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు అంతా అంగీకారం తెలిపారు.

Sushila Karki Nepal Interim PM: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
Sushila Karki

కఠ్మాండూ: 'జెన్ జెడ్' యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌ (Nepal)లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి (Interm Prime Minister)గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి (Sushila Karki) శుక్రవారం రాత్రి 8.45 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


నేపాల్ ఆర్మీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌తో 'జెన్ జెడ్' ప్రతినిధులు సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్లమెంటును రద్దు చేసి, కర్కిని తాత్కాలిక ప్రధానిగా నియమించాలంటూ 'జెన్ జెడ్' ప్రతినిధులు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు అంతా అంగీకారం తెలిపారు. దీంతో 73 ఏళ్ల సుశీల కర్కి తాత్కాలిక పభుత్వ అధిపతిగా నియమితులయ్యేందుకు మార్గం సుగమమైంది.


ఎవరీ సుశీల కర్కి

కర్కి 1971లో బిరాట్‌నగర్‌లో అడ్వకేట్‌గా లీగల్ కెరీర్ ప్రారంభించారు. క్రమంగా పలు పదోన్నతులు పొందుతూ 2009లో సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. 2016లో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని ధోరణిని ప్రదర్శిస్తారనే గుర్తింపును పొందారు. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్సెస్‌లో ఆమె మాస్టర్ డిగ్రీ పొందారు. నేపాల్‌లోని త్రిభువన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్ర పట్టా (బ్యాచిలర్ డిగ్రీ) పొందారు.


ఇవి కూడా చదవండి..

కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు

చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడి ఫొటో‌ను రిలీజ్ చేసిన ఎఫ్‌బీఐ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 08:58 PM