Assembly elections: రేపటి నుంచి విజయ్ యాత్ర..
ABN , Publish Date - Sep 12 , 2025 | 10:42 AM
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 13 నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ఇటీవల డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్(Vijay) అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 13 నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ఇటీవల డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఆ వినతిపత్రంలో విజయ్ పర్యటించనున్న నియోజకవర్గాల వివరాలను పొందుపరిచారు.
ఈ నెల 13న తన మొదటి విడత పర్యటనకు తిరుచ్చి సమీపంలోని శ్రీరంగం నుంచి విజయ్ శ్రీకారం చుట్టనున్నారు. 13న తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు నియోజకవర్గాలు, 20న నాగపట్టినం, తిరువారూరు, మైలాడుదురై, అక్టోబర్ 4, 5న కోవై, నీలగిరి(Neelagiri), తిరుప్పూరు, ఈరోడ్, అక్టోబర్ 11న కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, 12న కాంచీపురం, వేలూరు, రాణిపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

అక్టోబర్ 25న సౌత్ చెన్నై, చెంగల్పట్టు, నవంబర్ 1న కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, 8న తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, విల్లుపురం, 15న తెన్‌కాశి, విరుదునగర్, 22న కడలూరు(Kadaluru), 29న శివగంగ, రామనాధపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. డిసెంబర్ 6న తంజావూరు, పుదుకోట, 13న సేలం, నామక్కల్, కరూరు, 20న దిండుగల్, తేని, మదురై నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. విజయ్ తొలివిడత ప్రచార పర్యటనకు వారాంతపు సెలవుదినాలైన శని, ఆదివారాలను మాత్రమే ఎంపిక చేసుకోవటం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News