Share News

CM Revanth Reddy: వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Aug 28 , 2025 | 08:43 PM

వరదల్లో చిక్కుకొని మృతిచెందిన వారికి, పంటలు నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. పరిహారానికి సంబంధించి పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని ఫోన్‌లో చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు.

CM Revanth Reddy: వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

మెదక్: వరదల్లో చిక్కుకొని మృతిచెందిన బాధిత కుటుంబాలకు, పంట నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు కాంగ్రెెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు(CM Revanth Reddy). పరిహారానికి సంబంధించి పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని ఫోన్‌లో చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన వర్షాలు- వరదలు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు (Telangana Floods).


కేంద్రం నుంచి అత్యవసరంగా నిధులు కోరేలా రిపోర్ట్ తయారు చేయాలని జిల్లా అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వరద తగ్గగానే పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక తయారు చేయాలని ఆజ్ఞాపించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను గుర్తించి, వాటిల్లో ఉన్న విద్యార్థులను వేరే చోటకు మార్చాలని సూచించారు. రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలకు పక్కా భవనం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


వర్షాలు, వరదల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల్లో నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని హామీనిచ్చారు. ఇక, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క కూడా వరదలపై సమీక్షించారు. కామారెడ్డిలో జరిగింది ప్రకృతి విపత్తని, వర్షాలు తగ్గగానే పంట నష్టాన్ని అంచనా వేసి అందరినీ ఆందుకుంటామని అన్నారు. నష్టంపై సీఎంకు నివేదిక ఇస్తామని, కేంద్రం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు, మూడ్రోజుల్లో రవాణా మెరుగుపరుస్తామని మంత్రి సీతక్క తెలిపారు. కాగా, వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కామారెడ్డిలోనూ పర్యటించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యింది.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 28 , 2025 | 08:59 PM