నల్లకుంట చెరువు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో చుట్టు పక్కల ఉన్న వందల ఎకరాలలో పంట పొలాల్లో ఎరుపు రంగునీరు వచ్చి చేరింది.
Telangana Prajapalana: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సాధన కోసం సకలజనులు పోరాడారని గుర్తుచేశారు.
మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. దీంతో సంగారెడ్డి ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్పల్లిలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని రెండు సంవత్సరాల కూతురిని ప్రియుడితో కలిసి చంపి పూడ్చిపెట్టింది ఒక తల్లి. అనంతరం వీరిద్దరూ గుంటూరుకి పారిపోయారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో బాలుర గురుకుల హాస్టల్ భవనంలోని తరగతి గది మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తప్పించుకున్నారు.
మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్ట్పై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులపై వెంటనే ఏసీబీ డీజీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
వరదల్లో చిక్కుకొని మృతిచెందిన వారికి, పంటలు నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. పరిహారానికి సంబంధించి పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని ఫోన్లో చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కొంత మంది కావాలని యూరియా కొరత పేరిట చెప్పులను లైన్లో పెట్టించి మరి రాజకీయం చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వారం రోజుల్లో తెలంగాణకు తీసుకు వస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మందికి పైగా విద్యార్థులు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకొర వైద్యం అందించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని హరీష్రావు ప్రశ్నించారు.