Chain Snatcher: భర్త కోసం భార్య చైన్ స్నాచింగ్.. చివరకు..
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:53 AM
భర్త చేసిన అప్పులను తీర్చేందుకు ఓ భార్య దొంగగా మారింది. గతంలో ఐటీ ఉద్యోగిగా పనిచేసిన ఓ మహిళ.. అప్పులతో కూరుకుపోయిన భర్త బాధ చూడలేక చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది. అయితే చివరకు ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
మేడ్చల్ జిల్లా, జనవరి14: భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడునీడగా ఉంటారు. చాలా మంది మహిళలు, తమ భర్తల కోసం అనేక త్యాగాలు చేస్తుంటారు. అలాగే.. ఇటీవల ఓ మహిళ తన భర్త కోసం చేసిన పని.. ఆమెను ఇబ్బందులకు గురిచేసింది. తన భర్త చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది. అయితే.. చోరీ చేసిన అరగంటకే అడ్డంగా పోలీసులకు దొరికింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా(medchal district crime) పరిధిలో చోటుచేసుకుంది.
మేడ్చల్ జిల్లాకు చెందిన రాజేశ్ అనే వ్యక్తిని, వరంగల్ ప్రాంతానికి చెందిన అనితా రెడ్డి అనే మహిళ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. అనిత.. గతంలో సాప్ట్‌వేర్ ఉద్యోగం(Software Professional) చేసింది. అయితే.. ఆ జాబ్ మానేసి ప్రస్తుతం ఇంట్లో ఉంటోంది. తొలుత ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేసిన రాజేశ్.. ఆ తరువాత మానేశాడు. అతడు నాలుగైదు లక్షల రూపాయల వరకు అప్పు చేశాడు. తాను చేసిన అప్పువల్ల తరచూ బాధపడుతున్నాడు. అతడు అలా ఉండటం చూసి.. తన భర్త అప్పులు ఎలాగైనా తీర్చాలని అనితా రెడ్డి నిర్ణయించుకుంది. దీంతో చైన్ స్నాచింగ్ చేద్దామని మియాపూర్ ప్రాంతానికి చెందిన నల్ల కమల అనే మహిళ మెడలో ఆభరణాలు దొంగలించేందుకు ప్రయత్నించింది.
లిప్ట్‌లో వెళ్తున్న కమల మెడలో గోల్డ్ చైన్ లాక్కునేందుకు అనిత ప్రయత్నించింది. ఇంతలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో.. చేతికి దొరికిన అర తులం నల్లపూసల గొలుసుతో అక్కడి నుంచి పరారైంది అనిత. బాధితురాలు కమల.. సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీ(CCTV Crime Arrest) ఆధారంగా అరగంటలోనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!