Share News

Hyderabad: వస్త్రధారణ మహిళల హక్కు...

ABN , Publish Date - Jan 14 , 2026 | 08:24 AM

తనకు చేసిన డ్యామేజిని పూరించడం సాధ్యం కాదని నటి అనసూయ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. తన క్యారెక్టర్‌ మీద అటాక్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Hyderabad: వస్త్రధారణ మహిళల హక్కు...

- అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణలు చెప్పాలి

- మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌ సంస్థల జేఏసీ

- నాకు చేసిన డ్యామేజీ పూరించడం సాధ్యం కాదు: సినీ నటి అనసూయ

హైదరాబాద్: సినీ నటీమణులపై దాడులు, వారి వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌ సంస్థల జేఏసీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు అన్నారు. ‘దుస్తులు, సంస్కృతి, సైబర్‌ వేధింపులు’ అనే అంశాలపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ సభ్యులు వి.సంధ్య, కె.సజయ, క్రిష్ణ కుమారి, రచన, దీప్తి, జ్యోతి, శ్రావ్య, శ్వేత, తేజస్విని, అంజలి, ఆర్‌.వెంకట్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.


సినీనటుడు శివాజీ వ్యాఖ్యలు బాధితులపై నేరభారాన్ని మోపే ప్రమాదకర ధోరణిని మరోసారి బయటపెట్టాయన్నారు. మహిళలు ఏ దుస్తులు వేసుకున్నారనే దాని గురించి కాదని, పురుషులు ఎలా ప్రవర్తిస్తున్నారనే దాని గురించే అని మహిళల దుస్తులపై ఉన్న పితృస్వామ్య ఆలోచనలను ప్రశ్నించిన నటి అనసూయ, గాయని చిన్మయిపై సామాజిక మాధ్యమాల్లో దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళల దుస్తుల పట్ల జరుగుతున్న దానిని ఒక కుట్ర కోణంగా, కల్చర్‌ పేరుతో జరుగుతున్నది హింసగా చూడాలని అన్నారు.


city4.2.jpg

నిధి అగర్వాల్‌, సమంతలపై దాడికి ప్రయత్నించిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. పలు సందర్భాల్లో తమను కూడా ట్రోలింగ్‌ చేశారని క్రిష్ణ కుమారి, సంధ్య, సజయ తెలిపారు. తనకు చేసిన డ్యామేజిని పూరించడం సాధ్యం కాదని నటి అనసూయ(Actress Anasuya) ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతూ అన్నారు. తన క్యారెక్టర్‌ మీద అటాక్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2026 | 08:24 AM