Home » Telangana » Mahbubnagar
ఉమ్మడి గండీడ్ మండల వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లలో వరి, మొక్కజొన్న తదితర పంటలు కోయగానే రోడ్లపై ఆరబెట్టడం ఆనవాయితీగలా మారుతోంది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎ మ్మెల్యే తూడి మేఘారెడ్డి సవాల్ విసిరారు.
త్వరలోనే జిల్లాలోని వయో వృద్ధులకు పౌష్టికాహారం, ఆరోగ్య సలహాలు ఇచ్చేందుకు వృద్ధాశ్రమం ప్రారంభిస్తామని కలె క్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఇందిరాగాంధీ కృషి చేశారని, గరీబీ హఠావో నినాదంతో పేదలకు దగ్గరయ్యారని దేశ ప్రగతికి ఎనలేని సేవలందించారని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా చెత్తా చెదారం కనిపించొద్దని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అధికారి, జిల్లా పరిశీలకురాలు ఏ.ఉషారాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ పాఠశాల, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాఠశాలల పరిశుభ్రత కార్యక్రమం స్పెషల్ క్యాంపెయిన్ 5.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జలసంచయ్ జన్ భాగీదారి 1.0 విభాగంలో జాతీయ స్థాయిలో మహబూబ్‌నగర్ జిల్లాకు అవార్డు వచ్చింది. 3వ కేటగిరిలో జిల్లా మూడో స్థానంలో నిలిచినందుకు ఇది దక్కింది.
చలి పంజా విసురుతోంది. నాలుగు రోజులుగా తీవ్రత పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు. చీకటైతే చాలు తలుపులు, కిటికీలు మూసేస్తున్నారు. రెండు దుప్పట్లు కప్పుకున్నా చలి తగ్గడం లేదు.
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉమామహేశ్వరం, జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ క్షేత్రాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డికి దక్కనున్నట్లు సమాచారం.
మహబూబ్‌నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలో కురుమూర్తి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశా యి. ఈ సందర్భంగా స్వామి వా రికి అలంకరించిన స్వర్ణాభరాలను తొలగించారు.