ముగిసిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:30 PM
మహబూబ్‌నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలో కురుమూర్తి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశా యి. ఈ సందర్భంగా స్వామి వా రికి అలంకరించిన స్వర్ణాభరాలను తొలగించారు.
ముగిసిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
చిన్నచింతకుంట/ఆత్మకూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలో కురుమూర్తి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశా యి. ఈ సందర్భంగా స్వామి వా రికి అలంకరించిన స్వర్ణాభరాలను తొలగించారు. ఆలయ ఆవరణలో చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లయ్య, ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పెట్టెలో ఉంచారు. అ నంతరం ప్రధాన ఆలయం నుంచి రాజగోపురం గుండా ఆత్మకూరుకు తరలించారు. అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరిచారు. అయితే మరో 15 రోజుల పాటు జాతరలో భ క్తుల రద్దీ కొనసాగనున్నది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ సారి గతం కంటే అధికంగా భక్తులు తరలివచ్చారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లయ్య, పాలకవర్గ సభ్యులు, భాస్కరాచారి, భారతమ్మ, నాగరాజు, ఉంద్యాల శేఖర్, బాదం వెంకటేశ్వర్లు, అర్చకులు వెంకటయ్య, విజయ్, సత్యం, ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.