చలి పంజా
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:41 PM
చలి పంజా విసురుతోంది. నాలుగు రోజులుగా తీవ్రత పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు. చీకటైతే చాలు తలుపులు, కిటికీలు మూసేస్తున్నారు. రెండు దుప్పట్లు కప్పుకున్నా చలి తగ్గడం లేదు.
చలి పంజా విసురుతోంది. నాలుగు రోజులుగా తీవ్రత పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు. చీకటైతే చాలు తలుపులు, కిటికీలు మూసేస్తున్నారు. రెండు దుప్పట్లు కప్పుకున్నా చలి తగ్గడం లేదు. ఈనెల 14న 17 డిగ్రీలున్న కనిష్ఠ ఉష్ణోగ్రత మరుసటి రోజే 2.4 డిగ్రీలు పడిపోయి 15.6 డిగ్రీలు నమోదుకావడంతో జనం అల్లాడిపోతున్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యల్పంగా 14.1 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో నగరంలో రాత్రి 8 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం ఏడు గంటలు దాటితే గానీ తలుపులు తెరచుకోవడం లేదు. మార్నింగ్ వాక ర్స్ తగ్గిపోయారు. సూర్యుడు వచ్చాకే మార్నింగ్ వాకర్స్ వస్తున్నారు. చలికితోడు తెల్లవారుజామున మంచు కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచుతో వాహనదారులు లైట్లు వేసుకొని డ్రైవింగ్ చేస్తున్నారు.
- ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫొటో గ్రాఫర్లు మహబూబ్‌నగర్/వనపర్తి