Share News

పేదరిక నిర్మూలనే ఇందిరాగాంధీ లక్ష్యం

ABN , Publish Date - Nov 19 , 2025 | 10:55 PM

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఇందిరాగాంధీ కృషి చేశారని, గరీబీ హఠావో నినాదంతో పేదలకు దగ్గరయ్యారని దేశ ప్రగతికి ఎనలేని సేవలందించారని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

పేదరిక నిర్మూలనే ఇందిరాగాంధీ లక్ష్యం
ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే జీఎంఆర్‌

- డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్‌

- ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ

మహబూబ్‌నగర్‌/జడ్చర్ల/హన్వాడ/రాజాపూర్‌/మహమ్మదాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఇందిరాగాంధీ కృషి చేశారని, గరీబీ హఠావో నినాదంతో పేదలకు దగ్గరయ్యారని దేశ ప్రగతికి ఎనలేని సేవలందించారని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతి సంద్భంగా నగరంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ రాజభరణాలు రద్దుచేశారని, బ్యాంకులను జాతీయం చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లాకొత్వాల్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత, నాయకులు మన్నె జీవన్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌గౌడ్‌, సంజీవ్‌ముదిరాజ్‌, ఏపీ మిథున్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, సురేందర్‌రెడ్డి, ఎన్పీ వెంకటేశ్‌, చంద్రకుమార్‌గౌడ్‌, అరవింద్‌కుమార్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రి, సీజె బెనహర్‌, అజ్మత్‌అలీ, రాములుయాదవ్‌, రాజేందర్‌రెడ్డి, ఆవేజ్‌ పాల్గొన్నారు. జడ్చర్ల మునిసిపాలిటీ కావేరమ్మపేటలోని ఇందిరాగాంధీ విగ్రహానికి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పుష్పలత, కౌన్సిలర్లు చైతన్యచౌహన్‌, రమేశ్‌, కాంగ్రెస్‌ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మహేందర్‌ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. రాజాపూర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ గౌడ్‌, శ్రీనివాస్‌నాయక్‌, యాదయ్య, గోవర్ధన్‌రెడ్డి, నసీర్‌బౌగ్‌, మల్లేష్‌, విక్రమ్‌రెడ్డి, రాజేష్‌ పాల్గొన్నారు. మహమ్మదాబాద్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ, మాజీ ఎంపీపీ శాంతిరంగ్యా ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు.

Updated Date - Nov 19 , 2025 | 10:56 PM