Share News

పాలమూరుకు జాతీయ అవార్డు

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:42 PM

జలసంచయ్‌ జన్‌ భాగీదారి 1.0 విభాగంలో జాతీయ స్థాయిలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు అవార్డు వచ్చింది. 3వ కేటగిరిలో జిల్లా మూడో స్థానంలో నిలిచినందుకు ఇది దక్కింది.

పాలమూరుకు జాతీయ అవార్డు
కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జలసంచయ్‌ జన్‌ భాగీదారి 1.0 విభాగంలో జాతీయ స్థాయిలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు అవార్డు వచ్చింది. 3వ కేటగిరిలో జిల్లా మూడో స్థానంలో నిలిచినందుకు ఇది దక్కింది. మంగళవారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో రాష్ట్రపతి ముర్ము హాజరైన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్‌. పాటిల్‌ చేతుల కలెక్టర్‌ విజయేందిర బోయి, డీఆర్డీఏ నర్సిములు పురస్కారం అందుకున్నారు. రూ.25 లక్షల నగదు బహుమతి కూడా ఇచ్చారు. జి ల్లాకు అవార్డు లభించడం పట్ల కలెక్టర్‌ విజయేందిర బోయి హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషితో, ప్రజల భాగస్వామ్యంతో ఈ అవార్డు లభించిందని అన్నారు. అధికారులకు, ప్రజలకు, సహకారం అందించిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు పురస్కారం లభించడంపై అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, మధుసూదన్‌నాయక్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Nov 18 , 2025 | 10:42 PM