Share News

పాఠశాలలు శుభ్రంగా ఉంచాలి

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:44 PM

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా చెత్తా చెదారం కనిపించొద్దని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అధికారి, జిల్లా పరిశీలకురాలు ఏ.ఉషారాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌వీఎం సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్‌ పాఠశాల, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాఠశాలల పరిశుభ్రత కార్యక్రమం స్పెషల్‌ క్యాంపెయిన్‌ 5.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

పాఠశాలలు శుభ్రంగా ఉంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధికారి, జిల్లా పరిశీలకురాలు ఉషారాణి

పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అధికారి ఉషారాణి

ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా చెత్తా చెదారం కనిపించొద్దని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అధికారి, జిల్లా పరిశీలకురాలు ఏ.ఉషారాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌వీఎం సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్‌ పాఠశాల, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాఠశాలల పరిశుభ్రత కార్యక్రమం స్పెషల్‌ క్యాంపెయిన్‌ 5.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉషారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెత్త సేకరణ చేయాలని, శుభ్రత తప్పని సరిగా పాటించాలని చెప్పారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల గదులను తొలగించాలన్నారు. వంట గదులు శుభ్రంగా ఉంచాలని, వీటన్నింటిపై ఎంఈవోలు రిపోర్టు తయారు చేసి ఇవ్వలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహించొద్దన్నారు. డీఈవో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగాతీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌, సీఎంవో సుధాకర్‌రెడ్డి, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ ప్రశాంత్‌, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మణ్‌సింగ్‌, మంజులా దేవి, ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.

ఫోన్‌లతో హెచ్‌ఎంల కాలక్షేపం

పాఠశాలల పరిశుభ్రతపై రాష్ట్ర అధికారి సమీక్ష చేస్తుంటే కొందరు ప్రధానోపాధ్యాయులు ఆర్‌వీఎం కార్యలయ ఆవరణలో సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేశారు. రాష్ట్ర, జిల్లా అధికారులు ఉన్నా.. తమను ఎవరు ఏం చేస్తారన్న ధీమాతో సమావేశాన్ని ఎగ్గొట్టి చెట్ల కింద తిరగడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 18 , 2025 | 10:44 PM