బీఆర్‌ఎస్ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:02 PM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జిల్లాలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎ మ్మెల్యే తూడి మేఘారెడ్డి సవాల్ విసిరారు.
- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జిల్లాలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎ మ్మెల్యే తూడి మేఘారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షా దీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చె క్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని బీ ఆర్‌ఎస్ నాయకుడు నీళ్ల పేరు పెట్టుకోవడానికి ఏమాత్రం అర్హుడు కాడని, నాగార్జునసాగర్, శ్రీ శైలం డ్యాం, కేఎల్‌ఐ కట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇక్కడి నాయకుడి ఆస్తులేంత, ఇప్పుడున్న ఆస్తులెన్నని కేసీఆర్ కూతురు కవితనే స్వయం గా ప్రశ్నించిందన్నారు. కవిత మాటలకు సమా ధానం చెప్పాలని, లేదంటే రాజీవ్ చౌరస్తాలో ముక్క నేలకు రాయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోని నాయకులు కేవలం జీవో లకే పరిమితమయ్యారని, నిధులు ఎందుకు తీ సుకురాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అం టేనే పేదల పక్షాన నిలబడుతుందన్నారు. త్వరలోనే మహిళలకు రూ.2,500 ఇస్తామన్నా రు. బీఆర్‌ఎస్ నాయకులకు దమ్ము దైర్యం ఉంటే ఆ పార్టీ అధ్యక్ష పదవిని బీసీ నాయకుల కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, ప్రమోదినిరెడ్డి, సతీష్, మహేష్, కృష్ణ, బ్రహ్మంచారి, చీర్ల సత్యంసాగర్ తదితరులు పాల్గొన్నారు.