త్వరలో వృద్ధాశ్రమం ఏర్పాటు
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:01 PM
త్వరలోనే జిల్లాలోని వయో వృద్ధులకు పౌష్టికాహారం, ఆరోగ్య సలహాలు ఇచ్చేందుకు వృద్ధాశ్రమం ప్రారంభిస్తామని కలె క్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి రాజీవ్ చౌరస్తా, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే జిల్లాలోని వయో వృద్ధులకు పౌష్టికాహారం, ఆరోగ్య సలహాలు ఇచ్చేందుకు వృద్ధాశ్రమం ప్రారంభిస్తామని కలె క్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని బుధవా రం ఐడీవోసీ సమావేశ మందిరంలో వారోత్సవ ముగింపు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ.. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేదీ నుంచి వారం రోజులపాటు వయో వృద్ధుల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిం చడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడైనా వృద్ధ తల్లిదండ్రులను తమ పిల్లలు సరైన ఆలనా పా లన నిర్వహించ ని పక్షంలో వెంటనే ఆర్డీవోకు ఫి ర్యాదు చేయాలని, లేదంటే టోల్ ఫ్రీనెంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచిం చారు. అనంతరం సీనియర్ సిటిజన్ కమిటీ స భ్యులను సన్మానం చేశారు. కార్యక్రమంలో అద నపు కలెక్టర్ యాదయ్య, డీఎస్పీ బాలాజీ, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, శంకర్ గౌడ్, నర్సిం హులు గౌడ్, హమీద్, శంశోద్దీన్, చిన్నమ్మ థా మస్, ఖమర్ రెహమాన్ పాల్గొన్నారు.
పకడ్బందీగా చీరల పంపిణీ
ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం పేద మహిళలకు ఇస్తున్న ఉచిత చీర ల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఏపీఎం, మహిళా సంఘా ల అధ్యక్షులను ఆదేశించారు. బుధవారం ఇంది రా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అనసూయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, మహి ళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.
సమర్థవంతంగా పూర్తి చేయాలి
చీరల పంపిణీ సమర్థవంతంగా పూర్తి చేయా లని అదనపు కలెక్టర్ యాదయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో చీరల పంపిణీ ఏర్పాట్లపై ఎంపీడీవోలు, ఏపీఎంలు, కార్యదర్శులు, సీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లతో వీసీ నిర్వహించారు. డిసెం బరు 9వ వరకు ఈ కార్యక్రమం నిర్వహించాల ని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగిం దని తెలిపారు. డీపీవో తరుణ్ చక్రవర్తి, డిప్యూ టీ సీఈవో రామ మహేశ్వర్, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, అధికారులు పాల్గొన్నారు.