Home » Telangana » Karimnagar
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పుడిప్పుడే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానా లకు పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొన్నది. బీసీలు, జనరల్‌కు కేటాయించిన సర్పంచ్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది.
ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం గోదావరిఖని ప్రభు త్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల మను గడ ప్రశ్నార్థకమవుతోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలం గాణ విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనై జింగ్ సెక్రెటరీ డాక్టర్ లక్ష్మీనారాయణ, రఘుశంకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతీ రైతుకు అవసరమైన యూరియా అందేలా పక్కా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం బ్రాహ్మణపల్లి రైతువేదిక వద్ద యూరియా అమ్మకాల పర్యవేక్షణ యాప్‌పై ఎరువుల డీలర్లకు నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ చరిత్ర ఉంటుందని, ఉద్య మకారులపై గన్ ఎక్కు పెట్టిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిదని, ఉద్యమంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎక్కడ ఉన్నాడోనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శనివారం పెద్దపల్లిలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి.
మొన్నటి ఎన్నికల వరకు అవన్నీ గ్రామ పంచాయతీలు... పంచాయతీ ఎన్నికల నగరా మోగితే చాలు... ఎటుచూసినా ఎన్నికల హడావుడి కనిపించేది. ఓవైపు సర్పంచు పదవులను ఆశించేవారు. మరోవైపు వార్డు సభ్యుల పదవులకు పోటీపడే వారు ఓటర్ల వద్దకు వచ్చి మద్దతు కోసం ప్రాధేయపడేవారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి దావతలు, మందు పార్టీల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆశావహులు ఖర్చు చేస్తున్నప్పటికీ వారికి డబ్బుల టెన్షన పట్టుకుంది. మూడు విడతల్లో సర్పంచ ఎన్నికలు జరుగనున్నాయి.
ఎన్నికల్లో గెలవాలంటే నామినేషన్ వేయాలి.. ప్రచారం చేయాలి. అందుకు కార్యకర్తలు, ప్రచార సామగ్రి తదితరాలు కావాలి. వీటన్నింటి కోసం డబ్బు కావాలి.. అకస్మాత్తుగా వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌తో పోటీ చేసే అభ్యర్థులు కావాల్సినంత డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నారు.
రాజకీయాల్లో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు కార్యకర్తల్లో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. రాజకీయాల్లో ఏర్పడే స్నేహలు అవసరార్థం కుదిరేవిగా నిరూపిస్తాయి. తమ అవసరాలకు అడ్డుపడనంత వరకు మాత్రమే తమ స్నేహితులు, శిష్యులకు అవకాశం కలిపించడానికి గురువులు సహకరిస్తారు.