యూరియా విక్రయ కేంద్రాల తనిఖీ
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:07 AM
కొత్తపల్లి మండలంలోన్లి యూరియా విక్రయ కేంద్రాలను కలెక్టర పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకం నిల్వల రిజిస్టర్‌ను పరిశీలించారు.
భగత్‌నగర్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి మండలంలోన్లి యూరియా విక్రయ కేంద్రాలను కలెక్టర పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకం నిల్వల రిజిస్టర్‌ను పరిశీలించారు. ఎరువుల నిల్వ, గోదామును సందర్శించారు. ఎరువుల దుకాణాల వద్దకు వచ్చిన రైతులతో మాట్లాడి యూరియా ఆన్‌లైన్ యాప్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా బుకింగ్‌యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా ఎరువుల అందాయన్నారు. భూమి విస్తీర్ణాన్ని బట్టి యాప్ యూరియా కోటాను నిర్ణయిస్తుందన్నారు. దీని వల్ల ఎరువుల పంపిణీలో ఎదరయ్యే రద్దీ గందరగోళ పరిస్థితి తొలగిపోతుందన్నారు. యాప్ ద్వారా క్రమ పద్ధతిలో పంపిణి జరుగుతుండడంతో పని ఒత్తిడి తగ్గిందని డీలర్లు తెలిపారు. ఈ సందర్బంగా రైతులు గులిగెపు బక్కయ్య, సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ యాప్‌లో యూరియా తీసుకునే పద్ధతి బాగుందని, దీని వల్ల వ్యయ ప్రయాసలు తగ్గాయన్నారు. గంటల తరబడి క్యూలైన్‌లలో వేచి ఉండే అవసరం తప్పిందన్నారు. వీలైన సమయంలో యాప్ ద్వారా సులభంగా యూరియాను బుక్ చేసుకుంటున్నామి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మార్క్‌ఫెడ్ డీఎం గౌరి నాగేశ్వరరావు, వ్యవసాయ సంచాలకుడు రణధీర్, ఏఈవో రాజేంద్ర ప్రసాద్, ఎంఏవో సంతోష్ తదితరులు పాల్గొన్నారు.