ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:49 PM
గ్రామ పంచాయ తీల పాలకవర్గం ఎలాంటి విబేధాలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి దిశలో ఉంటాయని జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ అన్నారు. మండలంలోని 10 గ్రామాల పంచాయతీలకు చెందిన 98 మంది వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 17 (ఆంఽఽధ్రజ్యోతి): గ్రామ పంచాయ తీల పాలకవర్గం ఎలాంటి విబేధాలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి దిశలో ఉంటాయని జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ అన్నారు. మండలంలోని 10 గ్రామాల పంచాయతీలకు చెందిన 98 మంది వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీ సీఈవో నరేందర్ హాజరై వార్డు సభ్యులకు పలు సూచనలు చేశారు. సీఈవో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను వినియోగించు కోవాలన్నారు. ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్, సర్పంచ్ మేకల రోజా రాణి విజయ్, ఏపీవో రమేష్‌బాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కమాన్‌పూర్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని ఎంపీడీవో సాధినేని ప్రియాంక అన్నారు. మంగళవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉప సర్పం చ్‌లు, వార్డుమెంబర్లకు శిక్షణ తరగతులను ఎంపీడీవో, ఎంపీవో సౌమ్య ప్రారంభించారు. ఎంపీడీవో మాట్లాడుతూ నిధులను దుర్విని యోగం చేయకుండా ప్రజల అవసరాల మేరకు వినియోగించుకోవాలని సూచించారు. శిక్షణలో భాగస్వామ్యం కావాలని, దీని ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీనియర్ అసిస్టెంట్ ఎరుకల వంశీకృష్ణ, ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులు పాల్గొన్నారు. అల్లి రాంమోహన్, బచ్చల ప్రసాద్, పిడుగు రవి, మండే వేణుగోపాల్‌లు శిక్షణ ఇచ్చారు.
పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): మండల కేం ద్రంలోని రైతువేదికలో ఎంపీడీవో పొల్సాని శశికళ అధ్యక్షతన వార్డు సభ్యుల విధులపై అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించారు. గ్రామ పంచాయతీ నిధుల వినియోగం, పారిశుధ్య నిర్వహణ, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధానాలపై అవగాహన కల్పిం చారు. శిక్షణలో 16 గ్రామ పంచాయతీలకు చెందిన 155 మంది వార్డు సభ్యులు, తహసీ ల్దార్ జేరుపోతుల సునీత, మండల పర్యవేక్ష కులు పూర్ణచందర్‌రావు, సీనియర్ అసిస్టెంట్ దాడి శ్రీనివాస్, ఎంపీవో సుదర్శన్, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్, శిక్షకులు పాల్గొన్నారు.