Share News

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:52 PM

గ్రామాల్లో విద్యుత్‌ సమస్యల పరిష్కా రానికే ప్రజాబాట నిర్వహిస్తున్నామని విద్యుత్‌ శాఖ రూరల్‌ ఏఈ రవిచందర్‌ అన్నారు. మం గళవారం బ్రాహ్మణపల్లిలో విద్యుత్‌ శాఖ ఆధ్వ ర్యంలో ప్రజాబాట నిర్వహించారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

పెద్దపల్లి రూరల్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్ర జ్యోతి): గ్రామాల్లో విద్యుత్‌ సమస్యల పరిష్కా రానికే ప్రజాబాట నిర్వహిస్తున్నామని విద్యుత్‌ శాఖ రూరల్‌ ఏఈ రవిచందర్‌ అన్నారు. మం గళవారం బ్రాహ్మణపల్లిలో విద్యుత్‌ శాఖ ఆధ్వ ర్యంలో ప్రజాబాట నిర్వహించారు. గ్రామ సభ నిర్వహించి విద్యుత్‌ సమస్యలు, అదనపు స్తం భాలు, సమస్యలపై తెలుసుకున్నారు. ఏఈ రవిచందర్‌ మాట్లాడుతూ లోవోల్టేజి, ఓవర్‌ లోడ్‌ సమస్యలను నివారించేందుకు ప్రజాబాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పొలాల వద్ద రైతు లు కెపాసిటర్లు బిగించాలని కోరారు. సర్పంచ్‌ మేకల రోజారాణివిజయ్‌, ఉపసర్పంచ్‌ శేఖర్‌, కార్యదర్శి ఝాన్సీ, పాల్గొన్నారు.

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): గుడిపెల్లిలో విద్యుత్‌ శాఖ అధికారులు ప్రజాబాట నిర్వహిం చారు. బసంత్‌నగర్‌ ఏఈ మానాల ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మా ట్లాడుతూ ప్రజల నుంచి విద్యుత్‌ సమస్యలు, కరెంటు కోతలు, పెండింగ్‌లో ఉన్న కనెక్షన్ల గురించి తెలుసుకున్నామన్నారు. ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్‌ కాసర్ల శ్రీసుధ కరుణాకర్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ శ్రీధర్‌, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ నర్సింగ్‌, లైన్‌మెన్‌ శ్రీని వాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:52 PM