నిబంధనల ప్రకారం పాలన కొనసాగాలి
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:46 PM
నిబంధనల ప్రకారం పంచా యతీ పాలన కొనసాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పంచా యతీలలో 3వ విద్యుత్ వైర్ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం పంచా యతీ పాలన కొనసాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పంచా యతీలలో 3వ విద్యుత్ వైర్ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామా నికి తప్పనిసరిగా 3వ విద్యుత్ వైర్‌ను ఏర్పాటు చేసేందుకు అవసర మైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహ ణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రోడ్లపై చెత్త ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంచాయతీ అనుమతి లేకుండా ఎటువంటి నిర్మాణాలు జరగడానికి వీలులేదని, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరి స్థితుల్లో అనుమతించ వద్దని కలెక్టర్ తెలిపారు. సెగ్రిగేషన్ షెడ్‌లను పూర్తి స్థాయిలో వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. డీపీఓ వీర బుచ్చయ్య, డీఎల్‌పీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
రైతులకు ప్రభుత్వ పథకాలు చేరేలా పటిష్ట చర్యలు
రైతులకు ప్రభుత్వ పథకాలు చేరేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ పని తీరుపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఎరువుల బుకింగ్ యాప్ ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రతీ రైతుకు అవసరమైన యూరియా అం దుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. రైతు బీమా పథకం కింద అర్హులైన రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసు కోవాలన్నారు. రైతుబీమా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సొమ్ము అందుతుందని, ఈ పథకం అమలులో ఎటువంటి నిర్లక్ష్యం వహించ వద్దన్నారు. రైతు నమోదు కార్యక్రమం (ఫార్మర్ రిజిస్టర్)లో రైతు పేరు నమోదు కాకుంటే వారికి పీఎం కిసాన్ సమాన్ నిధికి సంబం ధించి సహాయం అందకుండా పోతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.