Share News

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:56 AM

ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదవి, ఉన్నత స్థానాలకు ఎదిగి తమ ప్రాంతంలోని మిగతా విద్యార్థులకు స్పూర్తిగా నిలవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆకాంక్షించారు.

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

కోనరావుపేట, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదవి, ఉన్నత స్థానాలకు ఎదిగి తమ ప్రాంతంలోని మిగతా విద్యార్థులకు స్పూర్తిగా నిలవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆకాంక్షించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏక లవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను మంగళవారం ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పరిశీలించారు. సీబీఎస్‌ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్‌ పరీక్షలు కొనసాగుతుండగా, ఇన్‌చార్జి కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీని పరిశీలించారు. స్కిల్‌ ఇండియాలో భాగంగా నేషనల్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కింద విద్యాలయంలో రిటైల్‌ ల్యాబ్‌లో విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇన్‌చార్జి కలెక్టర్‌ వారితో మాట్లాడారు. వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడు తున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌ పూర్తి అయిందా లేదా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచిం చారు. ఈ తరగతిలోని అంశాలపై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటా యని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇన్‌చార్జి కలె క్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆకాంక్షించారు.

మధ్యాహ్న భోజనం తయారీ పరిశీలన

విద్యాలయంలో మధ్యాహ్న భోజనం తయారీని ఇన్‌చార్జి కలెక్టర్‌ పరిశీలించారు. మెనూ ప్రకారం సిద్ధం చేసిన ఆహార పదార్థాల నాణ్య తను తనిఖీ చేశారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర పదార్థాల నాణ్యతా, గడువు తేదీని పరిశీలించారు. కిచెన్‌, స్టోర్‌ రూం నిర్వహణపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ రామ్‌ సూరత్‌ యాదవ్‌, తహసీల్దార్‌ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, పీఆర్‌, హౌసింగ్‌ ఏఈ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:56 AM