బాల్య వివాహాలను అరికట్టడానికి కృషి చేయాలి
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:08 AM
బాల్య వివాహలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఆయన మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు.
భగత్‌నగర్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఆయన మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం అమూల్యమైన దశ అని, బాల్య వివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక మానసిక అభివృద్దిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. చదువు మధ్యలో ఆగిపోవడం వల్ల జీవితాంతం ఎన్నో సమస్యలను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రాజ్‌కమల్‌రెడ్డి, కో-ఆర్డినేటర్ పోలవేణి భూమేష్, భూపాలపల్లి కో-ఆర్డినేటర్ తిరుపతి, ఒంటెల కరుణాకర్‌రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్‌కుమార్, కమ్యునిటీ మొబిలైజర్లు లత, శ్యామల, లహరి, కోమలత, శ్రీలత, ప్రభాలత పాల్గొన్నారు.