Share News

ముగిసిన జిల్లాస్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడలు

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:10 AM

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ఉదయం నిర్వహించిన ఖో-ఖో, వాలీబాల్‌ పోటీల ఫైనల్‌ మ్యాచ్‌లను జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి కర్ర అశోక్‌రెడ్డి ప్రారంభించారు.

ముగిసిన జిల్లాస్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడలు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ఉదయం నిర్వహించిన ఖో-ఖో, వాలీబాల్‌ పోటీల ఫైనల్‌ మ్యాచ్‌లను జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి కర్ర అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల నుంచి 1150 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభచాటారు. బాలబాలికల విభాగాల్లో ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించారు. అనంతరం సెక్టోరియల్‌ అధికారి కర్ర అశోక్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి వేణుగోపాల్‌ విజేతలకు పతకాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీడీలు కొమురోజు కృష్ణ, అంతడ్పుల శ్రీనివాస్‌, చందా శ్రీనివాస్‌, డి వీరన్న, బి సత్యనారాయణ, వంగపల్లి సూర్యప్రకాశ్‌, కనకం సమ్మయ్య, రజనీ, రేణుక, శ్రీనివాస్‌, ఎల్‌వీ రమణ, డి సత్యానంద్‌, శ్రీధర్‌రెడ్డి, ప్రవీణ, స్నేహలత, అనిల్‌, చిరుత శ్రీనివాస్‌, భాగ్యలక్ష్మి, రమేష్‌, అరుణ, విష్ణు, కట్ట సంతోష్‌, హరీష్‌, నాగార్జున పాల్గొన్నారు.

ఫ పోటీల విజేతలు...

ఖో-ఖో బాలుర విభాగంలో దన్గర్‌వాడి ప్రథమ, గంగాధర ద్వితీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో గంగాధర ప్రథమ, వీణవంక ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. కబడ్డీ బాలుర విభాగంలో గన్నేరువరం ప్రథమ, చెల్పూరు ద్వితీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో సీఈవో అల్గునూరు ప్రథమ, కరీంనగర్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో గంగాధర ప్రథమ, ఎలగందుల ద్వితీయ స్థానం సాధించాయి. ఫుట్‌బాల్‌ బాలుర విభాగంలో చొప్పదండి ప్రథమ, ద్వితీయ స్థానాలు నిలిచాయి. పోటీల్లో విశేష ప్రతిభచాటిన క్రీడాకారులను త్వరలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పీఎంశ్రీ క్రీడలకు ఎంపిక చేశారు.

Updated Date - Feb 18 , 2026 | 12:10 AM