Home » Telangana » Karimnagar
సిరిసిల్లలో తయారు చేసే పాలిస్టర్ వస్త్రానికి కూలిని 15 రోజుల్లో పెంచాలని లేకుంటే సమ్మె కు వెళుతామని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తెలిపారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిం చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల్లో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అకాడమిక్ ప్యానెల్ బృం దాల పాఠశాలల పరిశీలనపై అధికారులతో సమీక్షించారు.
జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ సబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో సత్వరం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ అన్నారు.
విద్యార్థులు సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి చూపాలని, ఆధునిక కాలంలో సైన్స్‌పై అవగాహన పెంచుకొని పరిశోధ నల వైపు దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సీఈఓ నరేందర్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీపీసీ టీటీసీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారం భించారు.
సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తతతో నేరాలను అరికట్టాలని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం కమిషరేట్ కార్యాల యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యం లో ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ అనే కార్యక్రమంలో భాగంగా ఆరు వారాల సైబర్ భద్రత ప్రచార కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.
ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి నవజాత శిశు సంరక్షణ, పోషకాహారంపై తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సూచించారు. మంగళవారం నగరంలోని మోతాజ్‌ఖానా అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆయన సందర్శించారు.
విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో భాగంగా ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను (ప్రత్యామ్నాయ లైన్లు) ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ మేక రమేష్‌బాబు తెలిపారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి 30 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. మున్సిపల్ సమావేశ మందిరంలో వారధి సొసైటీ ద్వారా పారిశుధ్య కార్మికులకు పీపీఈ శానినేషన్ కిట్లను మంగళవారం పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలను 26 వేల రూపాయలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు డిమాండ్ చేశారు.