Share News

ఫర్టిలైజర్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:17 AM

ఎరువుల కోసం రైతులు పడే ఇబ్బందులు తొలగించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌ను రైతులు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు.

ఫర్టిలైజర్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

తంగళ్లపల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఎరువుల కోసం రైతులు పడే ఇబ్బందులు తొలగించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌ను రైతులు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు. గురువారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్‌ ఎరువుల షాప్‌లో కలెక్టర్‌ గరిమఅగ్రవాల్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్‌ చేసుకున్నారు..? ఎంతమంది రైతులు తీసుకువెళ్లా రు అని ఆరా తీసి రిజిస్టర్లను పరిశీలించారు. గోదాంలో ఉన్న ఎరువుల నిల్వలు రిజిస్టర్లలో నమోదు చేసిన అంశాలను పరిశీలించారు. అనంత రం కలెక్టర్‌ మాట్లడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొం దించిన ఫర్టిలైజర్‌ యాప్‌ను రైతులు పోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని యాప్‌ ద్వారా ఎరువులు బుక్‌ చేసుకోవాలన్నారు. అన్ని ఫర్టిలైజర్‌ షాప్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు సహాయం చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సహాయకుడు ఉం టాడని తెలిపారు. జిల్లాలోని రైతులందరు యాప్‌ ద్వారా యూరియ బుక్‌ చేసుకుని తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికా రులు నిత్యం ఎరువుల షాప్‌లలో తనిఖీలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఈనెల 1వ తేది నుంచి ఇప్పటివరకు 92వేల 735 సంచుల యూరియా వచ్చిందని, యాప్‌ ద్వారా 84 వేల 68 మంది రైతులు ఎరువులు బుకింగ్‌ చేసుకున్నారని తెలిపారు. 79వేల 948 మంది కోనగోలు చేయగా ఇంకా 11వేల 694 నిలువలు ఉన్నట్లు పేర్కోన్నారు. ఈ తనిఖీలో ఏడీఏ ప్రదీప్‌, తహసీల్దార్‌ విజయ ప్రకాశ్‌రావు తదిత రులు ఉన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:17 AM