ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:31 AM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ మండల స్థాయి అధికారులకు సూచించారు.
-కలెక్టర్ సత్యప్రసాద్
కోరుట్ల రూరల్, ఫిబ్రవరి 19 (ఆంద్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ మండల స్థాయి అధికారులకు సూచించారు. గురువారం మండలం లోని అయిలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను ఆర్‌డీఓ జీవాకర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లభ్దిదారులతో మాట్లాడారు. ఆర్థిక పరమైన సమస్యలుంటే ఐకేపీ సహకార సంఘాల ద్వారా రుణాలు పొందాలని సూచించారు. దశల వారీగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపు నేరుగా ఆధార్ లింక్ ద్వారా ఖాతాలో జమచేయాలని సూచించారు. పూర్తి అయిన లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ చైతన్య, గ్రామ సర్పంచ్ రామకృష్ణలతో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అదనపు తరగతి గదుల నిర్మాణం పరిశీలన
కోరుట్ల, ఫిబ్రవరి 19 (ఆంద్రజ్యోతి) : పీఎంశ్రీకి ఎంపికయిన ప్రభుత్వ బాలికల పాఠశాలను గురువారం కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనీఖీ చేశారు. పాఠశాలలో నిర్మాణం చేస్తున్న 2 అదనపు తరగతి గదులతో పాటు సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనులను పరిశీలించారు. తరగతి గదుల నిర్మాణం ల్యాబ్ ఏర్పాట్లను పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ఇంజనీరుతో పాటు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, ఆర్‌డీఓ జీవాకర్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి సత్యనారాయణ, మండల విద్యాధికారి నరేశం, పాఠశాల ప్రధానో పాధ్యాయుడు గంగాధర్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఫకోరుట్ల, ఫిబ్రవరి 19 (ఆంధ్ర జ్యోతి) : భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి సమస్యలను పరిష్క రించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. గురువారం పట్టణం లోని ఆర్‌డీఓ కార్యా లయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనీఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. జాతీయ రహదారి పనులకు సంబంధించిన ఆర్డర్ కాపీలను త్వరగా ఇవ్వాలని పెండింగ్ పనులను వేంగవంతం పూర్తి చేయ్యాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. మీ సేవ నుంచి వచ్చిన సర్టిఫికెట్లను పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు చెపటాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్యలతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.