Share News

పంటల సాగుకు నీరు అందించాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:16 AM

రంగనాయక సాగర్‌ నుంచి ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌ వరకు కెనాల్‌ను నిర్మించి పంటల సాగుకు నీరందించి రైతులను అదుకోవాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గుంటి వేణు డిమాండ్‌ చేశారు.

పంటల సాగుకు నీరు అందించాలి

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : రంగనాయక సాగర్‌ నుంచి ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌ వరకు కెనాల్‌ను నిర్మించి పంటల సాగుకు నీరందించి రైతులను అదుకోవాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గుంటి వేణు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడం తో కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భం గా గుంటి వేణు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలం పెద్దలింగా పూర్‌ గ్రామంలో కెనాల్‌ నిర్మాణం కోసం రైతులు చేపట్టిన నిరహార దీక్షలకు సీపీఐ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. రంగనాయక సాగర్‌ నుంచి నిర్మించిన కెనాల్‌ దాచారం గ్రామ శివారు వరకు నిర్మించి వదిలేశారన్నారు. దానిని పెద్ద లింగాపూర్‌ గ్రామం వరకు నిర్మిస్తే తంగళ్ళపల్లి మండలంలోని 12 గ్రామాలు ఇల్లంతకుంట మండలంలోని నాలుగు గ్రామాలు దాదాపుగా 30 వేల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. దీంతో రైతుల కష్టాలు తీర డంతోపాటు పండించుకుంటే పంటలకు తగినంత నీరు లభిస్తుందన్నారు. భూసేకర ణలో భాగంగా రైతులకు ఐదు కోట్ల 59 లక్షల రూపాయలు రైతులకు చెల్లించి పనులు ప్రారంభించాల్సి ఉన్నదన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కెనాల్‌ పూర్తిచేయాలని సంవ త్సరం క్రితం 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేయగా స్థానిక ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దీనికోసం బడ్జెట్‌ కేటాయించి కెనాల్‌ పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. సంవత్సరం గడిచిపో యినా అమలుకు నోచుకోలేని కారణంతోనే రైతులు మళ్లీ నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం రైతుల పంటలపై, సాగునీరుపై గౌరవం ఉన్నా తక్షణమే భూ సేకరణ చేసి కెనాల్‌ను తవ్వించాలన్నారు. రైతులకు చేతినిండా పని కల్పించే విధం గా సాగునీరు అందించాలని కోరారు. ఈ కెనాల్‌ను నిర్మిస్తే 20 చెరు వులు, కుంటల ద్వారా సాగునీరు అందడంతోపాటు రైతులకు అందు బాటులోకి వస్తుందని, తక్షణమే ప్రభుత్వం గనుక చర్య తీసుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు సోమ నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిమీసం లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:16 AM