Share News

ధర తగ్గించడంపై పత్తి రైతుల ఆందోళన

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:32 PM

పత్తికి మద్దతు దర దక్కక రైతులు ఆందోళన నిర్వహించారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌కు 200 మందికి పైగా రైతులు పత్తిని తీసుకవచ్చారు. క్వింటాలు పత్తికి 6 వేల నుంచి 6,500 రూపాయలు పెట్టడంతో రైతులు ఆందోళనకు దిగారు.

ధర తగ్గించడంపై పత్తి రైతుల ఆందోళన

పెద్దపల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పత్తికి మద్దతు దర దక్కక రైతులు ఆందోళన నిర్వహించారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌కు 200 మందికి పైగా రైతులు పత్తిని తీసుకవచ్చారు. క్వింటాలు పత్తికి 6 వేల నుంచి 6,500 రూపాయలు పెట్టడంతో రైతులు ఆందోళనకు దిగారు. కేవలం 16 మంది రైతులకు మాత్రమే క్వింటాలుకు రూ.7,300 ధర పెట్టారని, మిగతా రైతులకు తక్కువ ధర పెట్టారన్నారు. బిడ్డింగులో కేవలం ఒకే ఒక వ్యాపారి పాల్గొని పత్తి కొనుగోలు చేశారని రైతులు తెలిపారు.

అడ్తిదారులు, అధికారులు కుమక్కై మద్దతు ధరలు దక్కకుండా చేస్తున్నారని పత్తి రైతులు ఆరోపించారు. క్వింటాలు పత్తికి 8 వేల రూపాయల మద్దతు ధర రావాల్సి ఉండగా, మార్కెట్‌లో అత్యధికంగా 7,300 నుంచి 7,400 రూపాయల వరకు ధర చెల్లిస్తు న్నారని, ఈ రోజు ఒకే వ్యాపారి బిడ్డింగులో పాల్గొని అత్యఽధిక మంది రైతులకు తక్కువ ధర పెట్టాడని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ పత్తికి ధర తక్కువ వేసిన విషయం వాస్తవమేనని, అడ్తిదారులతో సమావేశమై ఎక్కువ మంది వ్యాపారులు బిడ్డింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు.

Updated Date - Feb 19 , 2026 | 11:32 PM