Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:20 AM

గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

వేములవాడ టౌన్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేముల వాడ అర్బన్‌ మండలం ఆరపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం శుభపరిణామమన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. ముంపు గ్రామాల ప్రజ ల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఆరపల్లి గ్రామంలో పలు సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. సంకెపల్లి లో గెజిట్‌ సమస్య పరిష్కరిస్తామన్నారు. మసిపూసి మారేడు కాయ చేయడం నాతో కాదని, మీ సమస్యలపై అసెంబ్లీలో మా ట్లాడటం జరిగిందన్నారు. త్వరలోనే వాటికి శాశ్వత పరిష్కారం చేస్తామ న్నారు. మహిళా సంఘం భవనాలకు రూ.10లక్షల మంజూరు చేశామ న్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, ఎంపీడీవో కీర్తన, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు పిల్లి కనుకయ్య, కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు లింగయ్య, ఎంపీవో వజీర్‌, సర్పంచ్‌ ఇటిక్యాల రాజు, ఉపసర్పంచ్‌ ప్రశాంత్‌, మాజీ సర్పంచ్‌లు నవీన, చిలువేరి మల్లేశం, ఆనందరెడ్డి, శ్రీని వాస్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:20 AM