Share News

నేరాల ఛేదనలో పోలీస్‌ జాగిలాల సేవలు కీలకం

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:30 AM

నేరాల ఛేదనలో పోలీస్‌ జాగిలాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కోన్నారు.

నేరాల ఛేదనలో పోలీస్‌ జాగిలాల సేవలు కీలకం
డాగ్‌ హ్యండ్లర్‌ రమేష్‌కు సర్టిఫికేట్‌ అందజేస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్‌

-ఎస్పీ అశోక్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): నేరాల ఛేదనలో పోలీస్‌ జాగిలాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కోన్నారు. జిల్లా పోలీస్‌ విభాగానికి చెందిన రాఖీ అనే నూతన పోలీస్‌ జాగిలం మొయినాబాద్‌ ఐఐటిఏలో 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చిన సందర్భంగా ఎస్పీ అశోక్‌ కుమార్‌ను పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా డాగ్‌ హ్యాండ్లర్‌ రమేష్‌ కలిశారు. ఈసందర్భంగా ఎస్పీ సర్టిఫికెట్‌ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పేలుడు పదార్థాల గుర్తింపు, మాదక ద్రవ్యాల స్వాధీనం, నిందితుల గాలింపు, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ గుర్తించడం వంటి కీలక సందర్భాల్లో జాగిలాల సేవలు అమూల్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్‌ ఇన్స్పెక్టర్‌ సైదులు, హెడ్‌ కానిస్టేబుల్‌ కూర్మరావు, కానిస్టేబుల్లు రమేష్‌, నాంపల్లి పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:30 AM