పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి మంజూరు
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:18 AM
పార్టీలకు అతీతంగా, అర్హులైన వారందరికి సీఎం సహాయనిధి ద్వారా నిధులను మంజూరు చేస్తున్నాని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : పార్టీలకు అతీతంగా, అర్హులైన వారందరికి సీఎం సహాయనిధి ద్వారా నిధులను మంజూరు చేస్తున్నాని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో గురువారం వివిద గ్రామాలకు చెందిన వారికి సీఎం సహాయనిధి, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యఖర్చులు ప్రైవేట్ ఆసుపత్రిలలో చెల్లించిన వారికి సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆడపిల్లల వివాహాలు భారంగా మారిన నేటిరోజుల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లు వరంగా మారాయని అన్నారు. పేదప్రజల అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీఓ శశికళ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.