Home » Telangana » Karimnagar
ఒక్కోసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములా యే చందమామ అంటూ బతుకమ్మ పాటల తో భీమన్న ఆలయ ఆవరణతో పాటుగా వేములవాడ పట్టణం మారుమోగిపోయింది.
సంస్కృతి సంప్రాదాయలు ఉట్టిపడేలా ఆడపడుచులు అత్యంత ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగతో ఊరురా పూల జాతర మొదలైంది.
సిరిసిల్ల పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో బతుకమ్మ ఘాట్ల వద్ద నిమజ్జనాల సౌకర్యార్థం రూ.29 లక్షల 50వేల ఏర్పాట్లను చేస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు.
పెరిగిపోతున్న విద్యుత్ చార్జీలు ఈ పరిస్థితులను అధిగమిం చేందుకు జిల్లా ప్రజలు సౌరశక్తి వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు.
సంప్రదాయ పంటలకు భిన్నంగా బంతిపూలను సాగుచేస్తూ రైతులు ఆదాయం పొందుతున్నారు.
నూతన కలెక్టరేట్‌లోకి కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ నెల 12 తర్వాత కొత్త కలెక్టరేట్‌లో పలు శాఖలు కొలువుదీరనున్నాయి. ఆయా శాఖలకు నూతన కలెక్టరేట్‌లో కార్యాలయాలు కేటాయించారు. ‘తమకు కొత్త కలెక్టరేట్‌లో కార్యాలయం కేటాయించాలనే’ వినతులు జిల్లా కలెక్టర్ దృష్టికి ఇంకా వస్తున్నాయి. ఇప్పటి వరకు అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ నెట్టుకొస్తున్న చాలా కార్యాలయాల హెచ్‌వోడీలు తమకు ఛాంబర్‌తో పాటు స్టాఫ్ గదులను అందించాలని విన్నవిస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ యేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటల్లో అంతంత మాత్రంగానే నీరు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో యాసంగి పంటలకు అవసరమైన సాగునీటిని విడుదల చేయడానికి నిల్వలు లేకుండా పోయాయి.
పల్లెలు పండుగ శోభను సంత రించుకోనున్నాయి. ఆడపడుచుల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ.. భక్తిశ్రద్ధలతో కొలిచే దేవీ శరన్నవరాత్రులు.. విజయదశమి వేడుకలు.. ఇలా పండుగల సందడి మొదలుకానుంది.
అడపడుచులు చిరునవ్వుల మధ్య మారుమోగే చప్పట్లు... వినసొంపుగా గౌరమ్మ అటాపాటలతో బుధవారం బతుకమ్మ పండుగ మొదలు కాబోతోంది. తొమ్మిది రోజుల పాటు సాగే పూల జాతరను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళలు అట్టహాసంగా జరపుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఇప్పుడు బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాల్లో పెద్దతనం పోషిస్తుంది.
సిరిసిల్ల విద్యుత్ ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించడంతోపాటు పదోన్నతులు కల్పిస్తామని ఎన్‌పీడీసీఎల్ డైరెక్ట ర్ ప్రభాకర్ హామీఇచ్చారు.