Share News

చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయసదస్సులు

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:01 AM

గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. గట్టేపల్లిలో మండల న్యాయ సేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు

చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయసదస్సులు

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. గట్టేపల్లిలో మండల న్యాయ సేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. జడ్జి గణేష్‌ మాట్లాడుతు చట్టాలపై ప్రతి ఒక్కరూ అవ గాహన కలిగి ఉండాలని, గ్రామాలలో, విద్యా సంస్థల్లో న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు.

చట్టాల పై అవగాహన కలిగి ఉండడం ద్వారా సమా జంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుం దన్నారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివా దాలకు సంబంధించి బాధితులు న్యాయ సేవాదికార సంస్థను సంప్రదిస్తే ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. క్షణికా వేశంలో ఇరువర్గాల వారు కేసులు పెట్టుకుని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టు తిరుగుతూ తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారని, రాజీ పడదలుచుకుంటే లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బార్‌ అసోసియోషన్‌ అధ్యక్షులు మేకల తిరుపతి రెడ్డి, న్యాయవాది కోడం అజయ్‌, సర్పంచ్‌ దేవెందర్‌, ఉప సర్పంచ్‌ రేణుక, కార్యదర్శి మీనా, వార్డు మెంబర్లు లక్ష్మణ్‌, సంతోష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:01 AM