ఇటుక బట్టీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:57 PM
మండలంలోని రంగాపూర్ పరిధిలోని వీఎస్‌ఆర్ ఇటుక బట్టీల్లో సీనియర్ సివిల్ జడ్జి భవాని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇటీవల ఇటుక బట్టీలో కార్మికులకు మౌలిక సదుపాయాలు లేవని లీగల్ సెల్ అఽఽథారిటి, హైదరబాద్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు సీనియర్ సివిల్ జడ్జి భవానితోపాటు తహసీల్దార్ రాజయ్య, కార్మిక శాఖ అధికారి హేమలతతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్ , ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రంగాపూర్ పరిధిలోని వీఎస్‌ఆర్ ఇటుక బట్టీల్లో సీనియర్ సివిల్ జడ్జి భవాని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇటీవల ఇటుక బట్టీలో కార్మికులకు మౌలిక సదుపాయాలు లేవని లీగల్ సెల్ అఽఽథారిటి, హైదరబాద్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు సీనియర్ సివిల్ జడ్జి భవానితోపాటు తహసీల్దార్ రాజయ్య, కార్మిక శాఖ అధికారి హేమలతతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు లేవని గుర్తించారు. సంబంధిత ఇటుక బట్టీ యజమానిని పిలిపించి కార్మికులకు సౌకర్యాలపై ప్రశ్నించారు. ఇటుక బట్టీల వద్ద తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, సౌకర్యాలతో పాటు కార్మికుల పిల్లలకు విద్యను అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారంలో మళ్లీ వస్తానని, అప్పటి వరకు ఏర్పాట్లు కల్పించాలని యజమానిని ఆదేశించారు. వారి వెంట రూరల్ ఎస్‌ఐ మల్లేష్, ఆర్‌ఐ శ్రీనివాస్ ఉన్నారు.