Share News

Karimnagar: ఆరోగ్య సంరక్షకులకు వ్యాక్సినేషన్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:08 AM

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంరక్షకుల కోసం అడల్ట్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు.

 Karimnagar:   ఆరోగ్య సంరక్షకులకు వ్యాక్సినేషన్‌

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంరక్షకుల కోసం అడల్ట్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. శుక్రవారం నగరంలోని మోతాజ్‌ఖానా అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో అడల్ట్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెపటైటీస్‌-బి వ్యాధి నుంచి ఆరోగ్య సంరక్షకు లను రక్షించడం, ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త కోసం అడల్ట్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో కొనసా గుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధ, జిల్లా ఇమ్యు నైజేషన్‌ అధికారి డాక్టర్‌ సాజిద, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజగోపాల్‌రావు, డీటీటీపీవో డాక్టర్‌ ఉమాశ్రీ, ఎంహెచ్‌ఎన్‌పీవో డాక్టర్‌ సనజవేరియా, యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇమ్రాన్‌, సూపర్‌వైజర్‌ బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:08 AM