Share News

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:44 PM

వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్‌ వినియోగదారుల ఫోరం చైర్మన్‌ ఎన్వీ వేణుగోపాలచారి అన్నారు. టౌన్‌-2 సబ్‌డివిజన్‌ పరిధిలోని సప్తగిరి కాలనీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణలో వినియోగదారుల సమస్యల వేదిక (లోకల్‌ కోర్టు)ను శనివారం నిర్వహించారు.

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలి
ఫోరం చైర్మన్‌ ఎన్వీ వేణుగోపాలచారికి వినతులు అందజేస్తున్న వినియోగదారులు

గణేశ్‌నగర్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్‌ వినియోగదారుల ఫోరం చైర్మన్‌ ఎన్వీ వేణుగోపాలచారి అన్నారు. టౌన్‌-2 సబ్‌డివిజన్‌ పరిధిలోని సప్తగిరి కాలనీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణలో వినియోగదారుల సమస్యల వేదిక (లోకల్‌ కోర్టు)ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రకాల ఎర్తింగ్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల కంచెకు కూడా ఎర్తింగ్‌ చేసుకోవాలన్నారు. లోకల్‌ కోర్టు ఏర్పాటు చేయడానికి ముందు స్థానిక విద్యుత్‌ సిబ్బందితో ఇంటింటికి ప్రచారం, కరపత్రాల పంపిణీని చేయాలని వినియోగదారులు సూచించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం రాకుండా చూడాలన్నారు. సరఫరా నిలిచిపోయిన సమయంలో సిబ్బంది ఫోన్‌ ఎత్తడం లేదని ఫిర్యాదు చేశారు. కోర్టు సమీపంలోని ఈఆర్వో కార్యాలయంలో విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి వచ్చిన వినియోగదారుల వాహనాలు పార్కింగ్‌కు ఇబ్బందులవుతున్నాయని తెలిపారు. సప్తగిరి కాలనీ, శ్రీనగర్‌ కాలనీలలో ఉన్న ఇనుప స్తంభాలను తొలగించాలని, లూజ్‌లైన్లను సరిచేయాలని, పాతవైన కండక్టర్ల స్థానంలో కొత్తవి వేయాలని, ఎత్తు తక్కువ ఉన్నచోట వాటి ఎత్తు పెంచాలని, మిడిల్‌ పోల్స్‌ వేయాలని కార్పొరేటర్లు కోరారు. కార్యక్రమంలో ఫైనాన్‌ ్స మెంబర్‌ ఎన్‌ దేవేందర్‌, ఎస్‌ఎవో రాజేంద్రప్రసాద్‌, డీఈ రాజం, ఏడీఈ లావణ్య, ఏఈలు సత్యనారాయణరెడ్డి, స్నేహ, త్రిమూర్తి, ఓంకార్‌, సద్దుల రాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 11:44 PM