Share News

Karimnagar: బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:11 AM

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ లేకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్‌, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్‌ అన్నారు.

Karimnagar:  బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

- బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ లేకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్‌, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినప్పటికీ స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదన్నారు. బీసీలకు రిజర్వేషన్‌ అమలు చేశాకే ఎన్నికలు నిర్విహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే గ్రామ పంచా యతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తుండడం బీసీ సమాజాన్ని రాజకీయంగా మోసగించే ప్రయత్నమన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరెడ్డిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, యువతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌కు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో పయ్యావుల మహేశ్‌, ఉమా మహేశ్వర్‌, గున్నాల కన్నంబా, నల్లగొని శ్రీనివాస్‌, బెల్లం నరేందర్‌, మహమ్మద్‌ అంజాద్‌, నరాల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:11 AM