వలస కార్మికుల పిల్లలకు టీకాలు వేయాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:48 PM
ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించి తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సజిదా పర్వీన్ అన్నారు.
హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించి తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సజిదా పర్వీన్ అన్నారు. శనివారం హుజూరాబాద్ మండలంలోని హైరిస్క్ ప్రాంతాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటుక బట్టీలు, స్టోన్ క్రషర్స్, రైస్‌మిల్స్, గ్రానైట్ పరిశ్రమ, పౌలీ్ట్ర ఫామ్స్, ఆయిల్ మిల్స్ తదితర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారన్నారు. వలస కార్మికుల కుటుంబాల్లో డ్రాపవుట్స్ పిల్లలను గుర్తించి వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు.