Karimnagar: పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:10 AM
తిమ్మాపూర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌లు పంచాయతీ రాజ్ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు.
- అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే
- పంచాయతీల నిర్వహణపై సర్పంచ్‌లకు శిక్షణ
తిమ్మాపూర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌లు పంచాయతీ రాజ్ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ శిక్షణలో చొప్పదండి, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలకు చెందిన 50 మంది సర్పంచులకు ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని తెలిపారు. సర్పంచులు గ్రామ పంచాయతీ పనుల నిర్వహణ, గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకే తికతను వినియోగించుకోవాలని, సాంకేతిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.